పారదర్శకంగా సంక్షేమ పథకాల సర్వే
రేగొండ: ఈ నెల 26నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వే ను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నా రు. గురువారం మండలంలోని భాగిర్థిపేట, దమ్మన్నపేట, కనిపర్తి గ్రామాలలో జరుగుతున్న ఫీల్డ్ సర్వేను ఆమె పరిశీలించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉండి, 20 రోజులు ఉపాధి పనిచేయడంతో పాటు వారికి వ్యవసాయ భూమి లేని వారే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని తెలిపారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఆర్‌ఐ, ఏఈఓలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment