‘మోడల్’ బస్టాండ్
వంతెనలతో
బస్టాండ్‌కు కళ..
మహారాష్ట్ర ప్రభుత్వం 2016లో కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెనను రూ.250కోట్ల వ్యయంతో నిర్మించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భూపాలపట్నం వద్ద రూ.140కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణంతో ఆ రెండు రాష్ట్రాలతో పాటు ప్రాణహితపై మరో వంతెనను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయడంతో మూడు రాష్ట్రాల నుంచి భారీ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కాళేశ్వరం వస్తున్నాయి. ప్రతి నిత్యం వేలమంది భక్తులు పలు రాష్ట్రాలకు తరలివెళుతుంటారు.
● ‘కాళేశ్వరం’ ఆధునికీకరణకు రూ.3.95 కోట్ల నిధులు మంజూరు
● మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక శ్రద్ధ
● సరస్వతీ పుష్కరాల వరకు అందుబాటులోకి..
● హర్షం వ్యక్తంచేస్తున్న భక్తులు, గ్రామస్తులు
కాళేశ్వరం: కాళేశ్వరం బస్టాండ్‌ను భక్తులు, సందర్శకులు, ప్రయాణికులు, ప్రజలను ఆకర్షించే విధంగా ఆధునికీకరించనున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ శనివారం పలు ఆర్టీసీ బస్సు డిపోలకు, బస్టాండ్‌లకు నిధులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. కాళేశ్వరం బస్టాండ్ ఆధునీకరణకు రూ.3.95 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కూడలి ప్రాంతమైన కాళేశ్వరం పుణ్యక్షేత్రం బస్టాండ్‌కు మంచిరోజులు రానున్నాయి.
జీర్ణోద్ధరణ సమయంలో..
1978నుంచి 1982 వరకు పురాతన ఆలయాన్ని అప్పటి రోడ్డు రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు ఆధ్వర్యంలో మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేశారు. అప్పుడే కాళేశ్వరంలో రేకులతో బస్టాండ్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి బస్టాండ్‌కు వచ్చి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు తరలివెళ్తున్నారు. అదే సమయంలో ఆలయాలన్నీ జీర్ణోద్ధరణ జరిగి బాహ్యప్రపంచానికి కాళేశ్వరం గురించి తెలిసింది.
సరస్వతీ పుష్కరాలకు అందుబాటులోకి..
మే 15నుంచి 26వరకు 12రోజుల పాటు మూడు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆర్టీసీ సేవలందించడానికి మోడల్‌గా తీర్చిదిద్దనుంది. మోడల్‌గా మారడంతో దీనికోసం ముందస్తుగానే నిధులు మంజూరు చేయడంపై పలువురు భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోడల్ బస్టాండ్ సేవలను సరస్వతీ పుష్కరాల వరకు అందుబాటులోకి తీసుకువరావడానికి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
చంద్రాపూర్ మోడల్‌గా ఆధునికీకరిస్తాం..
బస్టాండ్ ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను మోడల్‌గా మార్చనున్నాం. చంద్రాపూర్ బస్టాండ్ మోడల్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో పరిశీలిస్తున్నాం. ఇంకా పైనల్ కాలేదు. తాత్కాలికంగా సరస్వతీ పుష్కరాలకు భారీగా వచ్చే బస్సుల కోసం హనుమాన్ ఆలయం వద్ద స్థలం ఏర్పాటు చేస్తున్నాం.
– ఇందు, డిపో మేనేజర్, భూపాలపల్లి
కాళేశ్వరం బస్టాండ్
Comments
Please login to add a commentAdd a comment