పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
పలిమెల: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్‌కుమార్ అధికారులను అదేశించారు. మండల కేంద్రంలో జరుగుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ప్రభుత్వ పథకాల సర్వే తీరును అయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబితాలో లేని వారు ఉంటే దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ అనిల్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కాటారం: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా సర్వే కొనసాగించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం కాటారం మండలం చింతకానిలో కొనసాగుతున్న సర్వేను సోమవారం సబ్ కలెక్టర్ పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి నరేశ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్వే సిబ్బంది ఉన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు
చిట్యాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి ఆమె మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు గుంటూరుపల్లిలో సర్వేను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment