రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
కాటారం: డ్రైవర్లు, వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు సాగించాలని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ నుంచి ప్రధాన కూడలి వరకు పోలీసులు ఆటోలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాన కూడలిలో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ఆటోడ్రైవర్లు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో పాటు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. తమపై తమ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారనే విషయాన్ని డ్రైవర్లు అనునిత్యం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలు ఇవ్వరాదని.. ఏదైనా ప్రమాదానికి గురైతే వాహన యజమానులు జైలుపాలు కావాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ పాల్గొన్నారు.
కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment