కార్మికులను పట్టించుకోని వైద్యులు | - | Sakshi
Sakshi News home page

కార్మికులను పట్టించుకోని వైద్యులు

Published Tue, Jan 21 2025 1:22 AM | Last Updated on Tue, Jan 21 2025 1:22 AM

కార్మ

కార్మికులను పట్టించుకోని వైద్యులు

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి ఏరియా ఆస్పత్రికి వెళ్లిన కార్మికులను వైద్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆస్పత్రికి వెళ్తే ఆస్పత్రిలో యంత్రాలు పనిచేయక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈసీజీ యంత్రం పనిచేయడం లేదని.. కార్పొరేట్‌ ఆస్పత్రికి పంపిస్తున్నారన్నారు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్య లేదని తిరిగి పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో కార్మికులు మూడు నాలుగు రోజులు వేతనాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు యాజమాన్యం మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తుందని.. ఈ టెస్టులకు ఒక్క రోజు యాజమాన్యం వేతనంతో కూడిన సెలవు ఇస్తుందన్నారు. యంత్రాలు పనిచేయకపోవడంతో కార్మికులు మరో రెండు రోజులు సెలవులు తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఆస్పత్రుల్లో మెరుగైన యంత్రాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు జనార్దన్‌, ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్‌, బాపు, జయశంకర్‌, శ్రీధర్‌, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

పటిష్టంగా సూర్యఘర్‌

పథకం అమలు

కాటారం: పీఎం సూర్యఘర్‌ పథకం అమలుకు ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ట్రాన్స్‌కో జిల్లా ఎస్‌ఈ మల్చూర్‌ సూచించారు. సూర్యఘర్‌ పథకం అమలుపై కాటారం మండలకేంద్రంలోని రైతువేదికలో ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా కాటారం గ్రామం మోడల్‌ విలేజ్‌గా ఎంపికై ందన్నారు. గ్రామంలో 1,080 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా ప్రతీ ఇంటికి సూర్యఘర్‌ పథకంలో భాగంగా ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోలార్‌ విద్యుత్‌ పథకం ఏర్పాటు కోసం సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహిస్తారని లబ్ధిదారులు తమ విద్యుత్‌ బిల్లు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ సర్వే సిబ్బందికి అందజేయాలని సూచించారు. మోడల్‌ విలేజ్‌లో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళ్తునట్లు ఎస్‌ఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ రెడ్‌కో డీఎం మహేందర్‌, ఏడీఈ నాగరాజు, సబ్‌ ఇంజనీర్‌ ఉపేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యమైన వైద్యసేవలు

అందించాలి

కాటారం: ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం(ఎన్‌క్యూఏఎస్‌) సభ్యులు డాక్టర్‌ ఆనంది సత్యకుమార్‌, డాక్టర్‌ కిరణ్‌ పాటిల్‌ సూచించారు. మహాముత్తారం మండలం బోర్లగూడెంలోని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను సోమవారం పరిశీలించారు. వెల్‌నెస్‌ సెంటర్‌ ద్వారా అందుతున్న వైద్యసేవలు, మందుల స్టాక్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రోజు వారి రోగుల వివరాలపై ఆరాతీశారు. అనంతరం వెల్‌నెస్‌ సెంటర్‌ ఆవరణలో సమావేశం నిర్వహించారు. వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రులు, వెల్‌నెస్‌ సెంటర్‌లలో వైద్యసిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలన్నారు. బృందం సభ్యుల వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా ప్రోగ్రామింగ్‌ అధికారిణి డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ ఉమాదేవి, డాక్టర్‌ ప్రమోద్‌, స్థానిక వైద్యులు డాక్టర్‌ సందీప్‌, క్వాలిటీ మేనేజర్‌ శరత్‌, డీపీఓ చిరంజీవి, డీడీఎం మధుబాబు, తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కార్మికులను పట్టించుకోని వైద్యులు1
1/2

కార్మికులను పట్టించుకోని వైద్యులు

కార్మికులను పట్టించుకోని వైద్యులు2
2/2

కార్మికులను పట్టించుకోని వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement