గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
● మంత్రి సీతక్క
భూపాలపల్లి రూరల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి భూపాలపల్లి మండలం బావుసింగ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిపురం తండాలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణ రావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment