ఉద్యోగ విరమణ సహజం
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని, వృత్తిలో ఉన్నప్పుడు చేసిన సేవలే చిరకాలం గుర్తుండిపోతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి ఎంపీడీఓ మహమ్మద్ ఇక్బాల్ హుస్సేన్ ఉద్యోగ విరమణ వీడ్కోలు కార్యక్రమం గురువారం జెడ్పీ కార్యాయలంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీఓ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శేష జీవితాన్ని సుఖమయంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, వివిధ మండలాల అధికారులు, మండల పరిధి లోని కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment