గాంధీ విగ్రహానికి వినతి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హమీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారని పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ కార్డును పాతరేసి డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవి, కుమార్‌రెడ్డి, భరత్‌చారి, రాజు, ఐలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment