ఆస్తి పన్నుల వసూలులో నిర్లక్ష్యం చేయొద్దు
● మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్
భూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో నిర్లక్ష్యం చేయవద్దని భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులను వందశాతం వసూలు చేయాలన్నారు. పన్నుల వసూలుకు సిబ్బందిని టీంలుగా విభజించి, వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ముందు.. మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment