భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే జూట్ బ్యాగ్‌ల తయారీ శిక్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి మారుతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాలో ఇప్పటికే వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తౌసండ్ క్యాటర్స్‌లలో జూట్ బ్యాగ్‌ల తయారీ కోర్సును నిర్వహించడానికి యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన శిక్షకులు ఈ నెల 10వ తేదీలోపు స్థానిక జీఎం కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment