జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యవర్గం
గద్వాలటౌన్: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా ఏర్పాటు తరువాత మొదటిసారిగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఎన్నికకు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, పరిశీలకుడు జీపీ పాల్గుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులు, క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా నియమించారు. జిల్లా ఫుట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్షుడిగా బండల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్, కోశాధికారిగా త్యాగరాజులు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బషీర్, వెంకట్రాములు, విష్ణు, జగన్, తిరుమలేష్, నవీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆనంద్‌కుమార్, చక్రధర్, ఝాడేశ్రీను, జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్‌గౌడ్, రాజారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీలుగా శివనాగరాజు, నగేష్, మధు, లీగల్ అడ్వైజర్లుగా పూజారి శ్రీధర్, బండల పాండుతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి జీపీ పాల్గుణ మాట్లాడుతూ క్రీడాకారుల అభ్యున్నతికి, క్రీడల నిర్వహణకు జిల్లా అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే గద్వాలకు ఫుట్‌బాల్‌లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. డీవైఎస్‌ఓ బీఎస్ ఆనంద్, జితేందర్, ఎస్వీ నారాయణ, రమణ పాల్గొన్నారు.
సీతారాం ఏచూరి
ఆశయాలను సాధిద్దాం
గద్వాల అర్బన్: సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి స్ఫూర్తితో భారతదేశంలో సామ్యవాద సమాజ స్ధాపన కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పీజేపీ క్యాంపులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆయన అధ్యక్షతన ఏచూరి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి దేశంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన యోధుడని, రాజ్యాంగబద్ద సంస్థల నిర్వీర్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడని కొనియాడారు. ఏచూరి స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సామ్యవాద సమాజ స్థాపనకు కంకణబద్దులు కావాలన్నారు. మోహన్‌రావు, మధుసూదన్ బాబు, రాజేష్, ఆంజనేయులు, రహ్మన్, ఇక్బాల్ పాష, పల్లయ్య, దేవదాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment