ఆర్డీఎస్ ఆయకట్టుకు వారబందీ
శాంతినగర్: ఆర్డీఎస్ ఆయకట్టుకు నీటి విడుదలలో వారబందీ పద్ధతి ప్రవేశపెట్టినట్లు ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువన ఉన్న రైతులకు నీటిని పూర్తిస్థాయిలో అందించడంతో పాటు దిగువన చివరి ఆయకట్టు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున డీ–40 వరకు నీరందించేందుకు మంగళవారం నుంచి వారబందీని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా 5నుంచి 14వ తేదీ వరకు డిస్ట్రిబ్యూటరీలు 24, 25, 25ఏ, 26ఏ, 26, 27, 27ఏ, 28, 29, 30, 31 కాల్వలను మూసి ఉంచుతామన్నారు. 15 నుంచి 24వ తేదీ వరకు డిస్ట్రిబ్యూటరీలు 31ఏ, 31బీ, 32, 32ఏ, 32బీ, 33 కాల్వలను మూసివేసి, మిగతా కాల్వలకు నీటిని విడుదల చేస్తామని ఈఈ ప్రకటించారు. విషయాన్ని రైతులు గమనించి పంటలకు నీటి తడులు ఇచ్చుకోవాలని కోరారు.
మున్సిపాలిటీల
అభివృద్ధికి సీఎం హామీ
అలంపూర్: నియోజకవర్గంలోని వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వివరించారు. వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలకు కమిషనర్లు లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. కమిషనర్ల నియామకంపై సానుకూలంగా స్పందించినట్లు సంపత్‌కుమార్ తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, జోగుళాంబ ఆలయ ధర్మకర్త జగన్‌గౌడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment