పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
గద్వాలటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన నాలుగు డీఏలతో పాటు ఈ–కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీని ప్రకటిస్తామన్న హామీని ఇప్పటి వరకు నెరవేర్చడం లేదన్నారు. ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 22వ తేదీలోగా పరిష్కరించాలని.. లేనిపక్షంలో హైదరాబాద్‌లో ధర్మాగ్రహ దీక్ష చేపడుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తపస్ నాయకులు నాగరాజు, వెంకటేష్, ప్రవీణ్, మల్లికార్జున్, మోహన్, రవి, భీమేశ్వర్‌రెడ్డి, రవీందర్ రెడ్డి, రత్నకర్‌రెడ్డి, నల్లారెడ్డి, పరుశరాముడు, రాజుసాగర్, అయ్యరెడ్డి, శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment