సాంకేతికతపై రైతులకు అవగాహన పెంచాలి
గద్వాల: వ్యవసాయంలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులుకు అవగాహన పెంచాలని.. డిప్లొమా కోర్సులలో నేర్చుకున్న పలు అంశాలను రైతులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ దేశీ 2022–23 ధ్రువపత్రాల పంపణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు విక్రయించే డీలర్లకు వాటి అవసరం వినియోగంపై శాసీ్త్రయమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 48వారాల పాటు డిప్లొమా కోర్సును కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా అందించడం జరిగిందన్నారు. విత్తనాల డీలర్లు రైతులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుని వారికి కొత్త వ్యవసాయ పద్ధతులు, ఎరువు మందులు, టెక్నాలజీ వినియోగం, పంటలకు సంక్రమించే రోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. దీనివల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయన్నారు. రైతులకు పంట విధీకరణ, ప్రత్యేకంగా ఆయిల్‌ఫామ్ సాగు, అధిక దిగుబడులు, ఆదాయం ఇచ్చే ఇతర పంటలపై అవగాహన కల్పించాలన్నారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న 38మంది డీలర్లకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియానాయక్, ఉద్యావన శాఖ అధికారి అక్బర్ బాషా, ఏఏఎస్‌వో సంగీతలక్ష్మీ, రమేష్‌బాబు, టెక్నికల్ ఏవో జనార్ధన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’కి 65 ఫిర్యాదులు
వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 65 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
వర్గీకరణపై వినతులు అందించాలి
ఎస్సీ ఉప కులాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమ్ అక్తర్ 31వ తేదీన మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ విచ్చేసి ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై అధ్యయనం చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ కుల సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కులసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కులవర్గీకరణ అధ్యయనంపై తమ విజ్ఞాపనలు రాతపూర్వకంగా సమర్పించాలన్నారు.
పంట సాగులో ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment