‘వంటా–వార్పు’తో ఉద్యోగుల నిరసన
గద్వాలటౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన రోజుకో రీతిలో వినూత్నంగా సాగుతున్నాయి. గురువారం 24వ రోజు దీక్ష చేపట్టిన కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ‘వంట–వార్పు’తో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డుపై సామూహికంగా భోజనాలు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల నాయకులు వేర్వేరుగా సంఘీభావం ప్రకటించి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. క్రమబద్ధీకరించే వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు, కేజీబీవీ ఎస్‌ఓలు, సీఆర్‌టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment