అంకితభావంతో పనిచేయాలి
గద్వాల: ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని, ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులైన వారికి దక్కేలా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో సమావేశం హాలులో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు జిల్లా అభివృద్ధికి నూతన ఉత్సాహంతో పనిచేయాలని, సంవత్సర కాలం పాటు జిల్లాలో పనిచేసిన అనుభవం విలువైనదని ఈ ఏడాది కూడా మరింత ఉత్సాహాంతో పనిచేస్తానన్నారు. ప్రతిఒక్కరు నూతన ప్రణాళికతో కట్టుదిట్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. 2024లో వెనకబడ్డ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదికి సమగ్ర ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment