2023లో నమోదైన సారా కేసులను ఆధారంగా చేసుకుని ఏ, బీ కేటగిరిలుగా విభజించారు. ఉమ్మడి జిల్లాలో నాగర్‌కర్నూల్ ఐదు స్టేషన్ల పరిధిలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. వాటిని తగ్గించడానికి నాలుగు డీటీఎఫ్ బృందాలు, నలుగురు ఎస్‌ఐలతోపాటు స్థానిక సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేశాం. నిత్యం తనిఖీలు కొనసాగుతాయి. కల్వకుర్తి పరిధిలోని తండాల్లో కొంత ఎక్కువగా సారా కాస్తున్నారు. ఈ నాలుగు స్టేషన్ల పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు అధికంగా చేస్తాం. ఈ నెల 16న నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చాం. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో కూడా సారా తయారీపై నిఘా కొనసాగుతుంది.
– విజయ్‌భాస్కర్‌రెడ్డి,
అసిస్టెంట్ కమిషనర్ ఎకై ్సజ్ శాఖ
●
Comments
Please login to add a commentAdd a comment