మళ్లీ గుప్పుమంటోంది..!
మహబూబ్‌నగర్ క్రైం: సారా తయారీ, విక్రయాలపై మరోసారి ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపనుంది. వంద శాతం సారా రహిత జిల్లాగా మార్పు చేయాలనే ఉద్దేశంతో ఆబ్కారీశాఖ కఠినమైన విధివిధానాలు రూపొందించింది. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సారా తయారీ అధికంగా ఉన్న ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌ఓ స్టేషన్ వారీగా జాబితా సిద్ధం చేశారు. ఇందులో ఏ కేటగిరి నుంచి డీ వరకు వేర్వేరుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు దాదాపు నెలరోజులపాటు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు సారా నియంత్రణపై ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా గిరిజన తండాలు, గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, తయారీకి ఉపయోగించే బెల్లం, ఇతర ముడి పదార్థాల దిగుమతిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ కేసులో బైండోవర్ నమోదయ్యాక కూడా సారా అమ్ముతూ పట్టుబడితే వారి నుంచి రూ.2 లక్షల జరిమానా లేకపోతే జైలుశిక్ష విధించాలి.
అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో..
ఉమ్మడి జిల్లాలో గతేడాది 2024లో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 1,054 కేసులు నమోదు కాగా.. ఇందులో 760 మందిని అరెస్టు చేశారు. వనపర్తి జిల్లాలో 603 కేసులు, మహబూబ్‌నగర్, పేట జిల్లాల్లో 540 కేసులు, గద్వాల జిల్లాలో 46 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరులో నాగర్‌కర్నూల్ జిల్లా సారా తయారీ, విక్రయాల్లో మొదటి స్థానంలో ఉండటంతో ‘ఏ’ కేటగిరి కింద చేర్చారు. ఇక్కడ ప్రధానంగా తెలకపల్లి, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఎక్కువగా సారా తయారీ ఉండటం వల్ల ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు ఎస్‌హెచ్‌ఓల పరిధిలో నెల రోజుల పాటు విధులు నిర్వహించడానికి నాలుగు డీటీఎఫ్ బృందాలు ఏర్పాటు చేయగా ఒక్కో టీంలో ఒక సీఐతోపాటు ఒక ఎస్‌ఐ, ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరితోపాటు అదనంగా మరో నలుగురు ప్రత్యేక ఎస్‌ఐలను కేటాయించారు. అలాగే స్థానిక ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది సైతం 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బీ కేటగిరి కింద మహబూబ్‌నగర్ సర్కిల్, వనపర్తి సర్కిల్, కొత్తకోట సర్కిల్ పరిధిలో ఉన్న గ్రామాలు, తండాలను చేర్చారు. అలాగే నారాయణపేట, గద్వాల జిల్లాలను డీ కేటగిరి కింద ఏర్పాటు చేశారు.
కేసుల పరంపర..
ఉమ్మడి జిల్లాలో 2015 డిసెంబర్‌లో సారా రహిత జిల్లాగా ప్రకటించారు. అప్పటికే 95 శాతం సారా నియంత్రణలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లో సారా భూతం మళ్లీ జడలు విప్పుతుంది. కొన్నిచోట్ల అక్రమ రవాణా పెరిగింది. గతేడాది మూడు నెలల్లో సారా కేసుల పరంపర ఒక్కసారిగా పెరిగింది. నెలరోజులుగా నల్లబెల్లం విక్రయాలు జోరందుకున్నాయి. అక్రమ రవాణా పెరిగింది. ఈ నెలరోజులపాటు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో సారా పూర్తిగా కంట్రోల్ చేయాలనే లక్ష్యంతో ఎకై ్సజ్ శాఖ కసరత్తు చేస్తోంది.
ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు
ఆబ్కారీ శాఖ అధికారులు సారా నియంత్రించడానికి గ్రామాలు, తండాల్లో నివసించే ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఎకై ్సజ్ అధికారులు కేవలం సారాను అదుపు చేయడానికి వాటిని అమ్మే వారిని అదుపులోకి తీసుకునే వారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల వెంట ఉండే గోడలపై, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ‘కల్తీ కల్లు, సారా తరిమివేద్దాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం’ అనే స్లోగన్స్ రాయిస్తున్నారు.
అచ్చంపేట238
కొల్లాపూర్
244
వనపర్తి 288
గతేడాది ఉమ్మడి జిల్లాలో
నమోదైన సారా కేసుల
వివరాలు
తెలకపల్లి216
కల్వకుర్తి
310
నాగర్‌కర్నూల్
46
కొత్తకోట
196
ఆత్మకూర్
119
జడ్చర్ల
98
మహబూబ్‌నగర్ 191
నారాయణపేట 135
కోస్గి
116
గద్వాల 35
అలంపూర్ 11
తండాలు, పల్లెలో జోరుగా సారా తయారీ, విక్రయాలు
గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు
ఉమ్మడి జిల్లాలోని నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి
16 నుంచి ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్
ముడి పదార్థాల రవాణాపై పటిష్ట నిఘా
Comments
Please login to add a commentAdd a comment