రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరి
గద్వాల క్రైం: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా జిల్లా ఇన్‌చార్జ్ రవాణాధికారి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా రవాణా కార్యాలయంలో వాహనదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి ఏటా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు తెలియజేస్తామన్నారు. సీటు బెల్టు, హెల్మెట్ ధరించడం, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు సామర్థ్యం కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ, నిద్రలేమి కారణాలతో డ్రైవింగ్ చేయరాదని ఈ సందర్భాల్లోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన యాక్టు మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో అధికారులు రాములు, రుక్మేందర్, మూజ్జుహమ్మద్, గోవర్ధన్, రుషి, గోవిందు, శ్రీను సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment