ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
గద్వాల టౌన్: ప్రతిఒక్కరూ నిత్యం పూజలు నిర్వహిస్తూ.. ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని హిందూ ధర్మం గురించి ప్రవచనం చేశారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ప్రస్తుతం హిందూ ధర్మాన్ని ఆచరించడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. హిందూ సమాజం ద్వారానే లోక కల్యాణం సిద్ధిస్తుందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాఽ ద్యత అందరిపై ఉందన్నారు. భారతీయ సంస్కృతి ద్వారానే సమాజంలో ప్రేమ, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు. గో సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. హిందుత్వ వికాసం జరగడానికి కృషి చేయాలన్నారు.మున్సిపల్ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొని జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment