నేటినుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
ఇటిక్యాల: మండలంలోని పెద్దదిన్నె గ్రామంలో వెలసిన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి సోమవారం వరకు నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య అర్చకులు జయసింహ మంగళవారం తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరిగే ఉత్సవాల మాదిరిగానే పెద్దదిన్నె వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల్లో బుధవారం వాస్తుహోమం, యాగశాల ప్రవేశం, గురువారం శ్రీవారి కల్యాణం, శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం, శనివారం దివ్యమంగళ బ్రహ్మ రథోత్సవం, ఆదివారం పారువేట ఉత్సవం, స్వామివారి ఊరేగింపు, సోమవారం చక్రస్నానం, నాగవేళి తీర్థావళి, ధ్వజవారోహణంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment