అంధుల కోసం స్మార్ట్ షూ..
సంజీవని హెలీకాప్టర్..
హెలీకాప్టర్ ప్రమాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణితోపాటు పలువురు మృత్యువాతపడిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ప్రణీత్ కుమార్ తన గైడ్ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలీకాప్టర్’ ప్రయోగాన్ని ప్రదర్శించారు. హెలీకాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ ప్రూఫ్, ఫైర్‌ప్రూప్‌తో కూడిన బెలూన్ ఓపెన్ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. ఎయిర్ బెలూన్‌లోనే ఆక్సిజన్ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్ అనుసంధానం ఉండటం వల్ల హెలీకాప్టర్ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది.
అంధులు నడిచేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ నాగార్జున టాలెంట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి నబయ్ తన గైడ్ భవానితో కలిసి స్మార్ట్ షూ ప్రదర్శించారు. షూ ముందు భాగంలో సెన్సార్లను ఏర్పాటుచేసి.. లోపల వైబ్రేషన్‌తో కూడిన అల్లారం మోగేలా రూపొందించాడు. గుంతలు, రాళ్లు, ఎదురుగా ఏమైనా వాహనాలు ఉన్నట్లయితే వైబ్రేషన్‌తో కూడిన విజిల్స్ వచ్చేలా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment