తీరనున్న ప‘రేషన్’
సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తు మొదలైంది. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో కొత్తకార్డుల జారీపై అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ సైతం ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఏళ్లుగా కొత్త రేషన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్న దరఖాస్తుదారుల్లో ఆశలు నెలకొన్నాయి.
రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా..
కొత్త రేషన్‌కార్డు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇటీవల ప్రజాపాలనలో సైతం దరఖాస్తు చేసుకున్నాను. రేషన్ కార్డు లేక అన్నిరకాల ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నాం. కొత్తగా వివాహం చేసుకున్న వారికి, అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను అందించాలి. – ఆలేటి శ్రీనివాసులు,
రాయిపాకుల, తెలకపల్లి మండలం
పైళ్లె పదేళ్లు
అయినా కార్డు లేదు
నాకు పెళ్లయి పదేళ్లు అయింది. ముగ్గురు పిల్లలున్నారు. కానీ మా కుటుంబానికి రేషన్ కార్డు లేదు. అందుకే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు మాకు వర్తించడం లేదు. ప్రజాపాలనలో కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆశగా ఎదురు చూస్తున్నాం.
– ఎర్రగొల్ల చెన్నమ్మ,
రామచంద్రాపూర్, మహబూబ్‌నగర్ రూరల్
మీసేవలో దరఖాస్తు చేశాం
నాకు పెళ్లి అయి రెండు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు రేషన్ కార్డు అందలేదు. మీసేవలో దరఖాస్తు చేసుకున్నా కొత్త కార్డు మంజూరు కాకపోవడంతో బియ్యం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి కొత్త రేషన్ కార్డులు అందజేయాలి.
– గౌతమి, వెంకటాపురం గ్రామం
గద్వాల ప్రభుత్వ
ఆదేశాల మేరకు..
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనతో పాటు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. – సుదర్శన్,
పౌరసరఫరాల శాఖ అధికారి, నారాయణపేట
● గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో పేరు ఉండి మృతి చెందిన, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్లను 360 డిగ్రీస్ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డీలర్ల సర్వే ప్రతిపాదనతో తొలగించారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే.. అక్కడ వారి పేర్లు రేషన్ కార్డులో నమోదు కాలేదు. దాదాపు ఎనిమిదేళ్లుగా కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన పేదలు, కొత్తగా పెళ్‌లైన జంటలు, దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికంగా మారడంతో చాలామంది అర్హులు సైతం పథకాలకు దూరం అవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియలోనూ రేషన్‌కార్డు లేని కారణంగా చాలామంది రైతులకు మాఫీ కాలేదు. ప్రభుత్వం మూడు రకాల కార్డులు.. ఆహారభద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు జారీ చేసింది. వీటికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉండగా.. కొత్త కార్డుల కోసం 93,189 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 30,345, నాగర్‌కర్నూల్ జిల్లాలోనే 28,763 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
● గతేడాది గతేడాది అక్టోబర్ 2న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కింద మళ్లీ రేషన్‌కార్డు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. అయినా ఇప్పటివరకు దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీకి మొగ్గుచూపడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రేషన్‌కార్డు దరఖాస్తుల వివరాలు:
కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధం
ఈ నెల 26 నుంచి జారీకి కసరత్తు
ఏళ్లుగా కార్డుల కోసం నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులు
Comments
Please login to add a commentAdd a comment