భోగి సంబరం..
వైభవంగా సంక్రాంతి వేడుకలు
గద్వాలటౌన్: ముంగిళ్ల ముందు గొబ్బెమ్మలతో ముచ్చటైన ముగ్గులు, వెచ్చదనాన్ని అందించే భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో జిల్లాలో సోమవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయానికి నిదర్శనంగా నిలిచే సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. పిండి వంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం.. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు.. వాటిలో కొత్తగా పండిన ధాన్యాలు.. గొబ్బెమ్మలు తదితర దృశ్యాలు కనిపించాయి. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగ వల్లులతో మెరిసిపోయాయి. సరదాల సంక్రాంతి పండగను చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహలతో జరుపుకొన్నారు. తెల్లవారుజామున నుంచే ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపించింది. నువ్వుల పొడితో స్నానాలు ఆచరించారు. మూడు రోజుల పండగలో భాగంగా మొదటిరోజు సోమవారం భోగి పండగును జరుపుకొన్నారు. భోగితో ప్రారంభమైన వేడుకలు కనుమతో ముగిస్తారు. సాంప్రదాయం వంటకాలు మొదటిరోజు సజ్జ, నువ్వులరొట్టెలు, తోడుగా రుచికరమైన కూరలు చేసుకున్నారు. ప్రతి ఇంటిలో వివిధ రకాలైన కాయగూరలతో కలకూర వండుకుని రుచికరమైన వంటలు ఆరగించారు.
పుల్లూరులో భోగి మంటలు
వేస్తున్న కుటుంబసభ్యులు
● రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్న లోగిళ్లు
● బంధుమిత్రులతో కళకళలాడిన పల్లెలు
● పతంగులతో చిన్నారుల సందడి
Comments
Please login to add a commentAdd a comment