పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించాలి
ఉండవెల్లి: పంటలు బాగా పండితే రైతు బాగుంటాడని.. ఆర్డీఎస్ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందేలా మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కంచుపాడులో విలేకర్లతో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు మాత్రమే ఆర్డీఎస్ ద్వారా నీరు అందిందని, మిగతా 40వేల ఎకరాలకు, చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో పంటలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అలాగే, అలంపూర్‌లో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు త్వరగా ప్రారంభించాలని కోరారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, అలంపూర్ చౌరస్తాలో మినీ డిపో ఏర్పాటు చెయ్యాలని పేర్కోన్నారు. కంచుపాడుకు జాతీయ రహదారి నుంచి ఇటిక్యాలపాడు మీదుగా బీటి మంజూరైన ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. సమస్యలపై దృష్టి సారించాలని మంత్రులను కోరారు. ఇదిలాఉండగా, మాజీ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథం మరణం తీరని లోటని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment