¢ 2025 జనవరిలో చోటుచేసుకున్న ఘటన విషయానికి వస్తే.. గద్వాల మండలం పూడూరు ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో వివిధ కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తు వ్యాపారం చేస్తున్నాడు. అయితే గద్వాల పట్టణంలోని ఏంజెల్ –1 పేరుతో కార్యాలయం ప్రారంభించి తెలిసిన వ్యక్తులు, బంధువుల నుంచి రూ. 3 కోట్లు అప్పు తీసుకుని తన భార్య పేరుతో స్టాక్ మార్కెట్‌లోని వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేసి లాభాలకు విక్రయాలు చేసేవారు. వచ్చిన లాభాలను రుణం తీసుకున్న వ్యక్తులు, బంధువులకు చెల్లింపులు చేస్తూ పలువురికి స్టాక్ మార్కెట్‌లో ఖాతాలను ఓపెన్ చేశాడు. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మృతి చెందడంతో కథ అడ్డం తిరిగింది. ఇచ్చిన రుణం చెల్లించాల్సిందిగా మృతుడి కుటుంబ సభ్యులను వారు ఒత్తిడి తీసుకువచ్చారు. నేడు రేపు అంటూ దాటవేయడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి గద్వాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
పై మూడు కేసులలో రూ. 20కోట్ల మేర బాధితులు మోసపోయినట్లు తెలుస్తోంది. తమకు ఎలాగైన న్యాయం చేయాల్సిందిగా ప్రజాప్రతినిధుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. నడిగడ్డలో ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాల్లో ప్రజలు పెట్టుబడులు పెట్టడం.. మోసపోవడం పరిపాటిగా మారింది.
¢ 2024 డిసెంబర్ 22న గద్వాలకి చెందిన ఓ వ్యక్తి ఎల్‌ఎఫ్‌ఎల్ కంపెనీ పేరుతో గొలుసుకట్టు స్కీం ప్రారంభించాడు. ఈ స్కీంలో సభ్యుడు రూ. 12వేలు డిపాజిట్ చేస్తే 45 రోజుల్లో రూ. 48వేలు ఆదాయం సమాకూరుతుందని ప్రజల నుంచి ఈ సంస్థలో పెట్టుబడులు రాబట్టేందుకు బీరోలు చౌరస్తాలోని ఓ బాంక్విట్‌హాల్ నందు 200 మంది సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ స్కీంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీటికి సంబంధించిన అనుమతి, రిజిస్ట్రేషన్ లావాదేవీల చెల్లింపుల నివేదికలను చూయించాల్సిందిగా పోలీసులు వాకబు చేయగా నిర్వాహకుడి నుంచి సమాధానం లేదు. దీంతో ఈ సంఘటన పై పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్వాహకుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
¢ 2024 డిసెంబర్ 29న అయిజ పట్టణంలో ఏజీజీకే ట్రేడర్స్ ఇండియా ప్రైవేటు లిమిటేడ్ కార్యాలయన్ని ప్రారంభించారు. ఈ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పేడితే ప్రతి నెల రూ. 40 వేల ఆదాయం అందజేస్తామని ఆ కంపెనీ నిర్వాహకులు నమ్మబలుకుతూ వ్యాపారం చేస్తున్నారు. ఆ సంస్థలో కొత్త వ్యక్తులను చేర్పిస్తే కొంత కమీషన్ సైతం అందజేస్తామని ప్రకటనలు చేయగా.. పలువురు పెట్టుబడులు పెట్టారు. అయితే కొన్ని రోజులకే ప్రజలకు శఠగోపం పెట్టిందీ కంపెనీ. మోసపోయిన బాధితులు లబోదిబోమన్నారు. ఈ క్రమంలో ఒకరు తనకు ఇవ్వాల్సిన డబ్బులు సంస్థ నిర్వాహకుడు ఇవ్వడం లేదని అయిజ పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment