గ్రామగ్రామాన పండగ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, మానవపాడు, మల్దకల్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సౌరభాలు వెల్లివిరిశాయి. గ్రామాల్లో భోగి మంటలు వేసి పండగ జరుపుకొన్నారు. బోగి మంటల చుట్టు యువత, చిన్నారులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీ పడ్డారు. పండగ సెలవులకు వచ్చిన చిన్నారులతో ప్రతి ఇల్లు కళకళలాడింది. హరివిల్లు రంగుల్ని పులుముకున్న కాగితం పక్షులు గాలిపటాలతో పిల్లలు ఆనందంగా గడిపారు. పలు గ్రామాల్లో పిల్లల హృదయాలతో పాటు పెద్దలను సైతం గాలిపటాలు రంజింప చేశాయి. పండగను పురస్కరించుకొని పలుచోట్ల రంగవల్లుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment