సకాలంలో పనులు పూర్తి చేయాలి
ఎర్రవల్లి: గ్రామాల్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల యాక్షన్ ప్లాన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం ఉమ్మడి ఇటిక్యాల మండల కేంద్రంతో పాటు షేకుపల్లి, కోదండాపురం గ్రామ పంచాయతీలను ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రూ.25,000 వ్యయంతో చేపట్టిన రూఫ్‌టాఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, రూ.86,000 వ్యయంతో చేపట్టిన పశువుల షెడ్ నిర్మాణాలు, రూ.18వేలతో చేపట్టిన కంపోస్టు పెట్టును అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్న హోల్డర్లు, భూమి ఐదు ఎకరాల కన్నా తక్కువగా ఉండి పశువులు ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. అర్హులైన రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ శివజ్యోతి, పిఏలు లావణ్య, హసన్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏ లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment