జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు

Published Fri, Jan 17 2025 12:41 AM | Last Updated on Fri, Jan 17 2025 12:41 AM

జోగుళ

జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు

అలంపూర్‌: దక్షిణ కాశీ అలంపూర్‌ క్షేత్ర ఆలయాలను ప్రముఖులు దర్శించుకున్నారు. డిప్యూటీ కలెక్టర్‌ షర్మిల, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సతీమణి మహాలక్ష్మి, సినీ యాంకర్‌ ప్రదీప్‌ కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ పురేందర్‌ కుమార్‌ అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ ధర్మకర్తలు సరస్వతి, నాగశిరోమణి, మాజీ సర్పంచ్‌ జోగుల రవి తదితరులు ఉన్నారు.

బొల్లుగట్టు

ఆంజనేయస్వామి ఆలయంలో..

ఎర్రవల్లి: మండల కేంద్రంలోని బొల్లుగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సతీమణి మహాలక్ష్మి, అదనపు కలెక్టర్‌ షర్మిళ, టాలీవుడ్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాతృమూర్తి మంచిరాజు భావన, పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సందర్శించారు. ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేరుశనగ క్వింటా రూ.6,201

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 1427 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6201, కనిష్టం రూ.2806, సరాసరి రూ.4510 ధరలు పలికాయి. అలాగే, 27 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5521, కనిష్టం రూ.4509, సరాసరి రూ.5511 ధర లభించాయి. 67 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2466, కనిష్టం రూ.2275, సరాసరి రూ.2446 ధర పలికింది. 186 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6869, కనిష్టం రూ. 3306, సరాసరి రూ. 6869 ధరలు వచ్చాయి.

సింగోటం లక్ష్మీనృసింహుడి ప్రభోత్సవం

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ప్రభోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి దీక్షహవనం, లక్ష్మీగణపతి హోమతర్పణం, సతీసమేత ఆదిత్యాది నవగ్రహ, ఆంజనేయ, వాస్తు, సర్వతోభద్రహవనాలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహవాహనంపై ఉంచి రత్నగిరి కొండ వరకు వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్‌ చైర్మన్‌ ఆదిత్య లక్ష్మణ్‌రావు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. అలాగే శుక్రవారం జరిగే రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

నవోదయ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు

బిజినేపల్లి: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, పరీక్షలను అధికారులు బాద్యతగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా విద్యా శాఖ అదనపు కమిషనర్‌ రాజశేఖర్‌రావు అన్నారు. గురువారం బిజినేపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ప్రవేశ పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 వేల మందికిపైగా విద్యార్థులు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి కోసం ప్రవేశ పరీక్షకు హజరుకానున్నారని, మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 27 మంది సూపరింటెండెంట్లు, 27 మంది పరీశీలకులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆయా జిల్లాల పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ వైస్‌ ప్రిన్సిపల్‌ జానకిరాములు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జోగుళాంబ  సన్నిధిలో ప్రముఖులు 
1
1/1

జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement