అడ్డుకట్ట పడేనా..?
జిల్లాలో జోరుగా గొలుసు దందా వ్యాపారం
●
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా, పెట్టుబడులు పెట్టించినా నేరం. చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీం బ్యానింగ్ యాక్ట్ మేరకు చర్యలు ఉంటాయి. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులపై విచారణ చేపడుతున్నాం. బాధితులకు న్యాయం అందేలా చూస్తాం. ఇలాంటి వ్యాపారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పే వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
● రూ.లక్షకు నాలుగు రెట్లు అంటూ బురిడీ
● నిజమని నమ్మి సామాన్యుల పెట్టుబడి
● రూ.కోట్లు మోసపోతున్న ప్రజలు
● పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు
గద్వాల క్రైం: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.. కేవలం రూ.లక్ష పెట్టుబడి పెడితే నాలుగు అంతలు ఎక్కువ ఆర్జించవచ్చు.. అంటూ.. సామాన్యులను నమ్మించి వారితో డబ్బులు కట్టించడమేగాక వారి బంధువులు, స్నేహితులతోనూ ఈ ఊబిలోకి లాగి బురిడీ కొట్టిస్తున్నారు కొందరు మోసగాళ్లు. ప్రస్తుతం నడిగడ్డలో ఈ దందాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఇటీవల అయిజ, గద్వాల రూరల్, గద్వాల పట్టణ పోలీసు స్టేషన్‌లో గొలుసుకట్టు స్కాంలపై ఇటీవల నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ. ఈ వ్యాపారం జిల్లాలో రూ.20 కోట్లకుపైగా నడిచినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment