కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యం
ఉండవెల్లి: కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమని సీఎంఓ జాయింట్ సెక్రటరీ సంగీత అన్నారు. బుధవారం ఉదయం మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులాన్ని ఆమె సందర్శించి విద్యార్థుల గదులు, భోజనశాల, తాగునీరు, బియ్యం, వంట సామగ్రి, కూరగాయలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని లక్ష్యం ఎంచుకొని.. దానిని చేరుకునేందుకు బాగా చదవాలని, అన్నింట్లో ముందుండేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని, నాణ్యమైన ఆహారం అందించాలని, సొంత పిల్లల్లా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎలిజిబిత్ సుహాసిని తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment