న్యాక్ బృందం పరిశీలన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చిన న్యాక్ పీర్ కమిటీ పీయూలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఉదయం 10.30 గంటలకు ఆరుగురు సభ్యుల కమిటీ చేరుకున్నారు. ఇందులో చైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్ రామశంకర్ దుబే కాగా.. సభ్యులు కేకే అగర్వాల్, అన్నస్వామి నారాయణమూర్తి, జయశ్రీ నాయర్, అశుతోష్‌కుమార్, మాల్యా కె దాస్ ఉన్నారు. ముందుగా వీరికి పీయూ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి వీసీ చాంబర్ వరకు పూర్ణకుంభం, తెలంగాణ బోనం, కోలాటాల మధ్య సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అక్కడ కొద్దిసేపు అడ్మినిస్ట్రేషన్ అధికారులు వీసీ చాంబర్‌లో చర్చలు జరిపారు. వారు అడిగిన ప్రశ్నలకు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప, ఐక్యూఏసీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ సమాధానాలు ఇచ్చారు. శుక్రవారం కొల్లాపూర్, వనపర్తి, గద్వాల పీజీ సెంటర్లలో కమిటీ సభ్యులు తనిఖీలు చేస్తారని, శనివారం పీయూలోని హాస్టళ్లు, స్పోర్ట్స్, ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లను పరిశీలిస్తారని సమాచారం.
18 డిపార్ట్‌మెంట్లు..
ఉదయం 11 గంటలకు వీసీ సమావేశ మందిరంలో ఆరుగురు కమిటీ సభ్యులకు వీసీ శ్రీనివాస్ ప్రొజెక్టర్ ద్వారా పీయూకు సంబంధించి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. పీయూలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి.. అడ్మినిస్ట్రేషన్ భవనాలు, గ్రౌండ్‌లు, ఎన్ని డిపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి.. ఎంత మంది టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అనే అంశాలపై పూర్తి సమాచారాన్ని కమిటీ సభ్యులకు వివరించారు. అక్కడి నుంచి నేరుగా బృందం సభ్యులు పీయూ పీజీ కళాశాలకు చేరుకుని మొత్తం 18 డిపార్ట్‌మెంట్లలో విస్తృతమైన తనిఖీలు జరిపారు. ఇందులో డిపార్ట్‌మెంట్ విద్యార్థులు, స్టాఫ్ వివరాలు కరిక్యూలర్ యాక్టివిటీస్, రీసెర్చి తదితర అంశాలపై డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీలతో సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి పూర్తిస్థాయి సమాచారం వచ్చిందని కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఆరుగురు సభ్యుల బృందానికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికిన అధికారులు
వీసీ ప్రజెంటేషన్ నుంచి ప్రారంభమైన పరిశీలన
పీయూ పీజీ కళాశాలలోని 18 డిపార్ట్‌మెంట్లలో మూడు బృందాలు
రేపు పీజీ సెంటర్లను సందర్శించే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment