అర్హులందరికీ సంక్షేమ పథకాలు
గద్వాల క్రైం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం గద్వాల మండలంలోని వీరాపురంలోని గ్రామసభకు ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు సంబంధిత అధికారులకు సహకరించి గ్రామసభలను సజావుగా నిర్వహించుకోవాలని, గ్రామంలో ఎవరైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
అధికారులను నిలదీసిన ప్రజలు
ఎర్రవల్లి: మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన గ్రామసభల్లో అర్హులను కాకుండా అనర్హులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేయడంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. గురువారం మండలంలోని జింకలపల్లి, ఎర్రవల్లి, షేకుపల్లి, ధర్మవరం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల నుంచి వివిధ ఫథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రాథమిక జాబితాలో వివిధ పథకాల కోసం నిజమైన అర్హులను గుర్తించలేదని ఆయా గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీయగా వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరేష్, ఎంపీడీఓ మొహియుద్దీన్, ఆర్‌డబ్లూఎస్ ఏఈ వంశీకృష్ణ, ఆర్‌ఐలు శంశీర్, శ్రీనివాసులు, కార్యదర్శులు, టిఎలు, ఏఈఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment