మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
గద్వాల న్యూటౌన్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ బిఎం. సంతోష్ అన్నారు. గురువారం పట్టణంలోని దౌదర్‌పల్లి సమీపంలో రూ.5కోట్లతో నిర్మించనున్న జిల్లా మహిళాసమాఖ్య నూతన భవనానికి ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి, భూమిపూజ పనులు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులు అందిస్తున్న రుణాలతో వివిధ వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టించే అవకాశం మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం పలు ప్రభుత్వ కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వార ప్రజల్లోకి తీసుకెళ్తోందని అన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి..
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు కూడా పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు సైతం ముందుకు రావాలని చెప్పారు. నూతన మహిళా సమాఖ్య భవనం త్వరగా నిర్మాణం పూర్తి అయ్యేలా పనులు చేపట్లాలన్నారు. ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ నర్సింగరావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద బ్యాంకులు, సీ్త్రనిధి ద్వార రుణాలు అందిస్తూ వ్యాపార నిర్వహణ అవకాశాలు, బీమా పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీచైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, చెన్నయ్య, రమేష్‌నాయుడు, కౌన్సిలర్లు దౌలు, శ్రీనివాసులు, నరహరిగౌడ్, జిల్లా మహిళా సమాఖ్య అద్యక్షురాలు సంగీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment