పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం..
పాలమూరు నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయం ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు నష్టం చేస్తుంది. ఇప్పటికే శ్రీశైలం, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి పథకాల్లో ఎంతో మంది రైతులు భూములు కోల్పోయారు. ఏదుల–డిండి మళ్లీ ఆ రైతులను ముంచుతుంది. వెనుకబడ్డ మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాల సాగునీటి హక్కును హరిస్తుంది. రైతుల మధ్య వైరానికి దారితీస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన ముందుకు పడకుండా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి చొరవ తీసుకున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయన మళ్లీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిండికి పాలమూరు నీటి తరలింపును ఒప్పుకోం.
– రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్
ఉపసంహరించుకోవాలి..
డిండి ఎత్తిపోతల పథకానికి అదే నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని తీసుకోవచ్చు. ఏదుల నుంచి నీటిని తరలించాలనుకోవడం వెనుకబడిన పాలమూరును నట్టేట ముంచడమే. దీన్ని వ్యతిరేకిస్తూ గతంలో వారించాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి జిల్లాకే అన్యాయం చేస్తున్నాడు. ఏదుల–డిండి నీటి మళ్లింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఊరుకునేదే లేదు.
– డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment