ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం
ఎర్రవల్లి: రైతులు ఆయిల్‌పామ్ సాగుచేసి అధిక ఆదాయం పొందవచ్చని ఆయిల్‌ఫెడ్ ఎండీ షేక్ యాస్మిన్‌బాషా కోరారు. గురువారం ఎర్రవల్లి మండలం బీచుపల్లి ఆయిల్‌పామ్ మిల్లును ఆమె సందర్శించి నర్సరీ, తోట, మిల్లును పరిశీలించారు. ఆయిల్‌ఫెడ్, ఉద్యాన అధికారులతో సాగు విస్తీర్ణం, ఉద్యాన పథకాలపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. బీచుపల్లి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ప్రత్యేక వేదికను ఏర్పాటుచేసి సాగుపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. తోట చుట్టూ శ్రీ గంధం మొక్కలు నాటించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయిల్‌పామ్ సాగు చేసిన పలువురు రైతులతో మాట్లాడి పంట సాగు, ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, ఆయిల్‌ఫెడ్ జీఎం సుధాకర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జ్ వెంకటేష్, ఉద్యాన అధికారులు రాజశేఖర్, మహేష్, ఇమ్రాన్, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
26న ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–14 విభాగాల సాఫ్ట్‌బాల్ బాలబాలికల ఎంపికలను ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పాఠశాల బోనఫైడ్, ఒరిజనల్ ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం పీడీ నాగరాజు (9959220075) నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో పీజీటీ బయోసైన్స్, టీజీటీ సైన్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణులై, టెట్ రాసిన మహిళా అభ్యర్థులు ఈ నెల 30లోగా పాఠశాలలో నేరుగా వచ్చి దరఖాస్తులు అందించాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 73311 70833, 96669 59372లను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఆయిల్‌ఫెడ్ ఎండీ షేక్
యాస్మిన్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment