ప్రశస్త్‌మైన భవితకు.. | - | Sakshi
Sakshi News home page

ప్రశస్త్‌మైన భవితకు..

Published Sat, Oct 19 2024 2:08 AM | Last Updated on Sat, Oct 19 2024 2:08 AM

ప్రశస

సత్వర చర్యలు చేపట్టాం

ప్రశస్త్‌ యాప్‌ ద్వారా విద్యార్థుల వివరాలన్నీ వందశాతం నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల వివరాలను త్వరగా నమోదు చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం. నమోదు వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు.

– ఎంవీవీ సత్యనారాయణ, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్‌, సమగ్ర శిక్షా, అమలాపురం

స్క్రీనింగ్‌ ముఖ్యమైనది

ప్రశస్త్‌ యాప్‌ ద్వారా విద్యార్థులను స్క్రీనింగ్‌ చేయడం ముఖ్యమైన అంశం. అభ్యసనంలో ఉన్న విద్యార్థులకు ఉన్న ఇబ్బందులను గుర్తించి సవరించేందుకు ప్రశస్త్‌ ఉపకరిస్తుంది. ఉపాధ్యాయులందరూ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులందరినీ సాధ్యమైనంత తొందరగా స్క్రీనింగ్‌ చేయాలి.

– ఎ.మధుసూదనరావు, డిప్యూటీ కలెక్టర్‌

మరియు అదనపు జిల్లా కోఆర్డినేటర్‌,

సమగ్ర శిక్షా, అమలాపురం

విద్యార్థుల్లో లోపాల

గుర్తింపునకు ప్రత్యేక యాప్‌

21 లోపాల గుర్తింపులో ఉపయుక్తం

రెండు విభాగాలుగా యాప్‌ విభజన

మొదటి దశలో గుర్తింపు,

రెండో దశలో నిర్ధారణ

అనంతరం తగిన వైద్యానికి సిఫారసు

రాయవరం: విద్యార్థుల్లో పలువురికి శారీరక, మానసిక సమస్యలుంటాయి. మరికొందరు గుర్తించలేని లోపాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇటువంటి వారిని గుర్తించడానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రిసోర్స్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) శ్రీప్రశస్త్‌శ్రీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ రూపొందించింది. ఉపాధ్యాయులే విద్యార్థులను పరిశీలించి వారిలోని లోపాలను ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది.

జిల్లాలో పరిస్థితి ఇదీ..

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపాధ్యాయుని పేరు, ట్రెజరీ ఐడీ, మెయిల్‌ ఐడీ, సెల్‌ నంబరు, యూడైస్‌ కోడ్‌తో ప్రశస్త్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంది. అనంతరం యాప్‌లో సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి.

21 రకాల లోపాల గుర్తింపునకు..

వైకల్యాలు ఉన్న పిల్లలను ధ్రువీకరించడం, స్క్రీనింగ్‌లో ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చడం, అశాసీ్త్రయ నిర్థారణ, లేబులింగ్‌ నుంచి రక్షణ, పిల్లల పరిస్థితి గురించి స్పష్టతను సులభతరం చేయడం, వైకల్యం ఉన్న విద్యార్థులకు సమగ్ర విద్యను అందించడం దీని ముఖ్య ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పింస్తారు. విద్యార్థుల్లో చదవడం, వినడం, మాట్లాడడంతో పాటు చెప్పిన పదాన్ని పదే పదే చెప్పమనడం, రోజువారీ పనులు సొంతంగా చేసుకోలేక పోవడం, అనుమతి లేకుండా తరగతి నుంచి వెళ్లడం, నెమ్మదిగా చదవడం, రాయడం, స్పష్టతలేని చేతిరాత, రివర్స్‌గా రాయడం, గణిత చిహ్నాలు అర్థం చేసుకోలేక పోవడంలో ఇబ్బంది పడడం, పునరావృత ప్రదర్శనలో ఇబ్బందులు, ఆసక్తిగా లేక పోవడం, చెప్పిందే చెబుతూ ప్రతిస్పందించడం, విచారంగా కనిపించడం, ఇతర విద్యార్థులతో పోలిస్తే సులభంగా అలసి పోవడం తదితర 21 రకాల లోపాల్లో దేనితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఉపాధ్యాయులు తమ ప్రత్యక్ష పరిశీలనతో నమోదు చేస్తారు.

రెండు విభాగాలుగా

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వివరాలను నమోదు చేసే ప్రశస్త్‌ యాప్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఇందులో పొందుపర్చినట్టుగా ఉపాధ్యాయులు విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరికొన్నింటిని వారే విద్యార్థిని నిశితంగా పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్‌లో 63 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపర్చాల్సి ఉంటుంది. పార్ట్‌–1లో లోపాలు గుర్తిస్తే, పార్ట్‌–2లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల లోపాలను ఉపాధ్యాయులు పరిశీలించి నిర్థారించి వైద్యులకు సిఫార్సు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రశస్త్‌మైన భవితకు..1
1/3

ప్రశస్త్‌మైన భవితకు..

ప్రశస్త్‌మైన భవితకు..2
2/3

ప్రశస్త్‌మైన భవితకు..

ప్రశస్త్‌మైన భవితకు..3
3/3

ప్రశస్త్‌మైన భవితకు..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement