రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
కరప: అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్లకు కరప మండలం పెద్దాపురప్పాడు బిరుదా సూర్యనారాయణ (ఫకీర్రావు) జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ శ్రీనివాస్ గురువారం ఈ విషయం తెలిపారు. విద్యా శాఖ ఆధ్వర్యాన కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరం హైస్కూలు క్రీడా మైదానంలో జరిగిన సాఫ్ట్‌బాల్ అండర్–14, అండర్–17 ఎంపిక పోటీల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. అండర్–17 విభాగం బాలుర జట్టుకు వై.సుధీర్, డి.సూర్య వెంకట మణికంఠ, జి.వీర మణి కుమార్, బాలికల జట్టుకు కె.సంధ్యారాణి ఎంపికయ్యారని వివరించారు. అనంతపురంలో శనివారం నుంచి సాఫ్ట్‌బాల్ అండర్–17 పోటీలు జరుగుతాయన్నారు. అండర్–14 సాఫ్ట్‌బాల్ విభాగంలో బాలుర జట్టుకు ఎన్.నాగేంద్ర, బి.అంజనీకుమార్, బాలికల జట్టుకు సీహెచ్ విజయలక్ష్మి, కె.అనురాధ ఎంపికయ్యారని తెలిపారు. చిత్తూరు జిల్లా అరకొండలో శుక్రవారం నుంచి అండర్–14 పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ బీవీవీఎస్‌వీ ప్రసాద్‌లను గ్రామ సర్పంచ్ బిరుదా సరస్వతి, ఉప సర్పంచ్ బిరుదా శ్రీనివాస అప్పారావు, విద్యా కమిటీ చైర్‌పర్సన్ యాళ్ల నాగమణి, హెచ్‌ఎం శ్రీనివాస్, ఎన్‌సీసీ ఉపాధ్యాయుడు టి.వెంకట్రావు తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment