చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు
కిర్లంపూడి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజుతో కలిసి రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వాహణపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా విధులు చేపట్టన తరువాత మొదటి సారిగా కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించినట్టు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడినా, సామాజిక మాద్యమాల్లో హద్దుమీరి ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ఎస్సై జి.సతీష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర స్థాయి ఈత
పోటీలకు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విశాఖలో డిసెంబరు 7, 8 తేదీలలో జరిగే అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ ఈత పోటీల్లో పాల్గొనే జట్టు వివరాలు జిల్లా స్విమ్మింగ్ సంఘ కార్యదర్శి ఐ.రాజు గురువారం తెలిపారు. గ్రూప్–1లో కె.ధనుంజయ్, ఎం.ముఖేష్, వి.మణికంఠ నవీన్ ఎంపిక కాగా, గ్రూప్–2లో టీవీసీ సాయి సాకేత్, టి.పూజిత్‌సాయి హర్ష, డి.అహిల్, ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ ధనుష్, ఎ.అభినయ్, ఎస్.హిమాన్షు, విరాజ్ విజయ్ కాలే, ఆర్.మనోహర్ శ్రీసాయి, ఎస్.మైఖేల్ అర్జన్, వై.గౌతమ్, పి.కౌశిక్ వర్ధన్, అర్‌ఎస్ జాన్, పి.దక్షిత, సీహెచ్ హిమద్యుతి ఎంపికయ్యారు. గ్రూప్–3లో దర్శిల్, పి.నీరజ్‌వర్ధన్, జి.భువనేష్, ఎం.షణ్ముఖ, ఎం.సాయి చరణ్, కె.ఎస్.రాధా కుమార్, బి.రాబిన్, ఎం.పల్లవి, ఎం.యశస్విని, తేజశ్రీ, జి.అన్విధ ఎంపికై న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, డీఎస్‌ఏ స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు గురువారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment