దోచుకునేందుకు దారులు
సాక్షి, అమలాపురం: టోల్ బాదుడుకు రెడీ అయ్యింది.. వాహనదారుల నడ్డి విరిచేందుకు కూటమి సర్కారు సిద్ధమవుతోంది. జాతీయ రహదారుల పైనే కాదు ఇక రాష్ట్ర రహదారుల పైనా ‘టోల్’ బాదుడు మొదలు కానుంది. దీనిపై శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి పైలట్ ప్రాజెక్టుగా గోదావరి జిల్లాలను ఎంపిక చేస్తామని ప్రకటించడంతో ఇక్కడి కార్లు, ట్రాక్టర్లు, లారీలు తదితర వాహన యజమానుల్లో గుబులు రేగుతోంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో ఆధునీకరించిన రోడ్లపై ఇప్పుడు టోల్ గేట్లు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం విచిత్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో భాగంగా జిల్లాలోని పలు కీలక రహదారులను ఎంపిక చేసుకుని టోల్ వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత ఆగస్టులోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి పంపించింది. తొలి దశలో జిల్లాలోని అమలాపురం– బొబ్బర్లంక, రాజవరం–పొదలాడ, జొన్నాడ–కాకినా డ రోడ్లను గుర్తించింది. తరువాత ఈ ప్రతిపాదనలు వెలుగులోకి రాలేదు. శాసనసభ సాక్షిగా గోదావరి జిల్లాల్లో స్టేట్ హైవేల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని, ఫలితాలను బట్టి మిగిలిన జిల్లాలకు విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఈ మూడు రోడ్లతో పాటు మరికొన్ని కీలక రహదారులపై సైతం టోల్ గేట్లను ఏర్పాటు చేస్తారని అనుమానాలు జిల్లా వాసుల్లో కలుగుతున్నాయి.
ఎన్‌హెచ్ పరిధిలోకి అమలాపురం– బొబ్బర్లంక
జిల్లాలో అమలాపురం–బొబ్బర్లంక రహదారి అత్యంత కీలకం. అమలాపురం నుంచి రావులపాలెం, అక్కడి నుంచి అటు తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, రాజమహేంద్రవరం, భద్రాచలం వంటి ప్రాంతాలకు వెళ్లేవారు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. దీనిపై టోల్‌కు ప్రతిపాదనలు వెళ్లినా ఇప్పుడు ఈ రహదారిలో మూడొంతులు జాతీయ రహదారి పరిధిలోకి వెళుతోంది. 216 జాతీయ రహదారిపై పేరూరు వై.జంక్షన్ నుంచి ఈదరపల్లి, ముక్కామల, కొత్తపేట పలివెల వంతెన మీదుగా రావులపాలెం మార్కెట్ యార్డు వద్ద 216–ఏలో కలిసే వరకూ ఎన్‌హెచ్ అనుసంధాన రహదారి నిర్మించనున్నారు. దీంతో దీనిపై రాష్ట్ర టోల్ వసూలు చేసే అవకాశం లేదని సమాచారం. ఇదే సమయంలో రాజవరం–పొదలాడ రహదారితోపాటు కొత్తగా ద్వారపూడి – మండపేట, రామచంద్రపురం – ద్రాక్షారామ – యానాం రహదారి లేదా జొన్నాడ – మండపేట – రామచంద్రపురం – నడకుదురు – కాకినాడ రోడ్డును పీపీపీ విధానంలోకి తెస్తారని అంచనా వేస్తున్నారు.
ఆ దారి ఎంతో కీలకం
జిల్లాలో పొదలాడ–రాజవరం రహదారి సైతం కీలకమైంది. ఇది రాజోలు దీవి నుంచి విజయవాడ, ఇటు రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వెళుతుంంది. ఈ రెండు రోడ్లపై వాహనాల తాకిడి అధికంగా ఉంటోంది. అలాగే జొన్నాడ–కాకినాడ, ద్వారపూడి– యానాం రహదారులపై కూడా ప్రయాణికుల వాహ నాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తు లు, ఆక్వా, కోడిగుడ్ల ఎగుమతి సైతం జరుగుతోంది. ఇప్పటికే జాతీయ రహదారులపై ఎడాపెడా టోల్ వసూలుతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. రావులపాలెం నుంచి విజయవాడ రహదా రిలో ఏకంగా నాలుగు టోల్ గేట్లు ఉన్నాయి. వీటికి అ దనంగా స్టేట్ హైవేలపై కూడా టోల్ వసూలు మొదలైతే ప్రయాణికులపై మరింత భారం పడనుంది.
నాడు అభివృద్ధి.. నేడు టోల్ పడుద్ది
ఇప్పుడు ఎన్‌హెచ్ పరిధిలోకి వెళ్లనున్న అమలాపురం నుంచి బొబ్బర్లంక రహదారి రహదారిని గత వైఎస్సా ర్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.18.13 కోట్లతో విడతల వారీగా ఆధునీకరించారు. ఈదరపల్లి నుంచి ముక్కామల మధ్య రహదారిని కూడా రూ.13 కోట్లతో అభివృద్ధి చేశారు. రాజవోలు–పొదలాడ రోడ్డును రూ.26 కోట్లతో రెండు దశల్లో నిర్మించారు. వీటిపై టోల్ వసూలుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆర్‌అండ్‌బీ రోడ్లపైనా టోల్‌కు సిద్ధం
రహదారులపై ఎడాపెడా బాదుడే
క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
పైలెట్ ప్రాజెక్టుగా గోదావరి జిల్లాలు
Comments
Please login to add a commentAdd a comment