ఉత్సాహంగా సాఫ్ట్‌బాల్ టోర్నీ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అండర్–17 అంతర్ జిల్లాల ఎస్‌జీఎఫ్‌ఐ సాఫ్ట్‌బాల్ పోటీలు శుక్రవారం రెండోరోజు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లను ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జార్జి ప్రారంభించారు. మొదటి క్వార్టర్ ఫైనల్స్‌లో తూర్పుగోదావరి జట్టు అనంతపురంపై 8–4, శ్రీకాకుళం జట్టు నెల్లూరుపై 11–6 స్కోర్‌తో, విజయనగరం జట్టు గుంటూరుపై 3–1, కడప జట్టు ప్రకాశంపై 10–2 స్కోర్‌తో గెలిచి సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లను టోర్నమెంట్ పరిశీలకుడు కె.ఈశ్వరరావు, ఎస్‌జీఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శులు సునీల్, పరశురామ్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment