ప్రమాదంలో వైద్య విద్యార్థికి తీవ్ర గాయాలు
రాజోలు: శివకోడు బైపాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థి మండెల శ్రీనివాస ఫణికుమార్ పృథ్వీ తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పృథ్వీ అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అమలాపురంలో కళాశాలకు పాలకొల్లు నుంచి మోటార్ సైకిల్‌పై శుక్రవారం బయలు దేరాడు. శివకోడు చిన్నోడు మద్యం దుకాణం సమీపంలో మట్టపర్రు వెళ్లేందుకు స్థానిక నారాయణ స్కూల్ బస్సు హైవే బైపాస్ రోడ్డును క్రాస్ చేస్తుండగా మోటార్ సైకిల్ ఢీకొని పృథ్వీ తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో రాజోలు ఏరియా ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. విద్యార్థి వద్ద ఉన్న గుర్తింపు కార్డుతో అమలాపురం కిమ్స్ ఆస్పత్రి, పాలకొల్లులో ఉన్న కుటుంబ సభ్యులకు రాజోలు ఆస్పత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థికి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రాజోలు నుంచి అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment