అమలాపురం రూరల్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు చైతన్య కశ్యప్ ఫౌండేషన్ అధ్వర్యంలో క్రీడా భారతి పురస్కారాలు 2024 కోసం ఈ నెల 8న క్రీడాజ్ఞాన పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీఎస్ సురేష్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యక్తిగత రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు httpr://kreeda bharatikfp.orf వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు, నాలుగో బహుమతిగా రూ.11 వేలు అందిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment