పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి
‘అపార్’మైన భారం
అపార్ నమోదు ఉపాధ్యాయులపై అధిక భారం మోపుతోందని, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. అపార్‌ను నిమిషాలు, గంటల్లో పూర్తి చేయమని ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు. అపార్ నమోదు సమయాన్ని పెంచాలని, ఈ ప్రక్రియను సరళతరం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఉపాధ్యాయులపై ఇప్పటికే ఉన్న యాప్‌ల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఉపాధ్యాయ పనిదినాలకు నష్టం లేకుండా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కేవలం ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పుల కోసం అనివార్య పరిస్థితుల్లో శిక్షణ ఇస్తున్నారన్నారు. ఆయన వెంట యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
● భారంగా మారిన ‘అపార్’ నమోదు
● ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు
రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. రాయవరం మండలం పసలపూడిలో జరుగుతున్న యూటీఎఫ్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేలోగా ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత పీఆర్సీకి సంబంధించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.22 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, వాటికి సంబంధించి బడ్జెట్‌లో ఏ విధమైన ప్రతిపాదనలు చేయకపోవడం దారుణమన్నారు. వీటి చెల్లింపునకు సరైన షెడ్యూల్ ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీతో చర్చించి వెంటనే ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గత ఆరున్నరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నియమించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీఎస్సీ రోడ్డు మ్యాప్ వేయాలని, సిలబస్ ప్రకటించాలని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. రాష్ట్రంలో 16,467 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. 117 జీవోను రద్దు చేసి, ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేస్తే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. అలాగే 117 జీవోను రద్దు చేసి, ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment