94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: జిల్లాలో నవంబర్ 30వ తేదీ సా యంత్రం 7 గంటల వరకు 94 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్టు కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ సెలవు కావడంతో శనివారమే పంపిణీ చే యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. డి సెంబర్ నెలలో 2,73,881 మంది పింఛన్‌దారు లకు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా 2,56,202 పింఛన్లు పంపిణీ చేసినట్టు ఆయన తె లిపారు. మిగిలిన లబ్ధిదారులకు 2వ తేదీలోగా పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీ తీరంలోని అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం కార్తిక మాసం చివరి శనివారం సందర్భంగా భక్తులతో శోభిల్లింది. వేకువ జామున వేద మంత్రాల నడుమ సుప్రభాత సేవ, తొలి హారతి సేవలను అర్చకులు వైభవంగా జరిపించారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. పాత గుడితో పాటు నవీన ఆలయాన్ని సందర్శించి శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువైన బాల బాలాజీ స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. స్వామివారి సన్నిధిలో నిత్య శ్రీలక్ష్మీ నారాయణ హోమాన్ని దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి గోవులకు పూజలు చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,60,891 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణ రాజు తెలిపారు.
శనైశ్చరునికి తైలాభిషేకాలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ ఉప కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో స్వామివారి పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రాతఃకాల సమయంలో ఆలయ ప్రధాన అర్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తైలాభిషేకాలు, పూజల ద్వారా దేవస్థానానికి రూ.1,73,025, అన్న ప్రసాద విరాళాలుగా రూ.48,839 వచ్చినట్టు ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment