రికార్డు స్థాయిలో సత్య వ్రతాలు
ఆదివారంతో 1.50 లక్షలకు చేరే అవకాశం
అన్నవరం: రత్నగిరిపై నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ ఏడాది కార్తిక మాసంలో కొత్త రికార్డు సృష్టించాయి. శనివారం దేవస్థానంలో 4,426 వ్రతాలు జరిగాయి. దీంతో గతంలో ఏ కార్తిక మాసంలోనూ జరగని విధంగా ఒక రోజు మిగిలి ఉండగానే 1,44,849 వ్రతాలు నిర్వహించారు. 2022లో అత్యధికంగా 1,42,378 వ్రతాలు జరగడం విశేషం. ఇప్పటి వరకూ ఇదే రికార్డు. దీనిని ప్రస్తుతం అధిగమించారు. ఇంకా కార్తిక అమావాస్య, ఆదివారం జరిగే వ్రతాలు కూడా కలిపితే ఈ సంఖ్య 1.50 లక్షలకు చేరే అవకాశం ఉంది. అత్యధికంగా ఈ నెల 25వ తేదీ, నాలుగో కార్తిక సోమవారం నాడు 10,728 జరిగాయి. 15వ తేదీ కార్తికపౌర్ణిమ నాడు 9,995 జరిగాయి. కాగా రూ.300, రూ.వెయ్యి, రూ.1500, రూ.2000 టిక్కెట్లతో నిర్వహించిన మొత్తం వ్రతాల్లో లక్ష వ్రతాలు రూ.300 టిక్కెట్లపై జరిగినవేనని అధికారులు తెలిపారు. ఈ వ్రతాల నిర్వహణ ద్వారా సుమారు రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment