బియ్యం అక్రమ రవాణాపై నిఘా
కాకినాడ సిటీ: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌కు పాల్పడే వారిపై పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీలను కొనసాగించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు, రీసైక్లింగ్ పాల్పడుతున్న వారిపై ఇప్పటి వరకూ నమోదు అయిన కేసులు, వాటి విచారణ, అక్రమాలపై చేపట్టిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌరసరఫరాలు, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధానికి నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత కార్యకలాపాలపై తనిఖీలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గతంలో నిర్వహించిన తనిఖీలలో భాగంగా బియ్యం అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ పాల్పడుతున్న వారిపై నమోదు అయిన కేసుల్లో దోషులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు లోతైన విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు పౌర సరఫరాలు, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో గత జూన్, జులై నెలల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన తనిఖీల సందర్భంగా నమోదు చేసిన 13 కేసులపై జరిపిన విచారణ, చేపట్టిన చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆర్.సుస్మిత, సీపీవో పి.త్రినాఽథ్, ఇన్‌చార్జి డీఎస్‌వో టి.లక్ష్మీప్రసన్నదేవీ, పౌరసరఫరాల సంస్థ డీఎం దేవులానాయక్, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పాల్గొన్నారు.
బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ షణ్మోహన్
Comments
Please login to add a commentAdd a comment