ధర దక్క లేదు
ఏలేరు వరదల కారణంగా పంట ఆలస్యం అవడమే కాకుండా పెట్టుబడి తడిసిమోపైడెంది. ఎకరాకు పెట్టుబడి రూ.30 వేల నుంచి రూ.40వేలు అయింది. 24 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కనీసం పెట్టుబడి కూడా తిరిగి చూడలేకపోయాను. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని అమ్ముకోలేకపోవడంతో దళారులను ఆశ్రయించి ప్రతి బస్తాకు రూ.150 నుంచి రూ.200 నష్టపోయాం.
– ఎస్.ప్రకాశరావు, రైతు, ఇసుకపల్లి,
కొత్తపల్లి మండలం
మద్దతు ధర దక్క లేదు
30 ఏళ్ల నుంచి కౌలు వ్యవసాయం చేస్తున్నా. మహారాణి సత్రం భూమి సుమారు ఎకరంన్నర సాగు చేస్తున్నా. గతం కంటే ఈ తొలకరిలో పెట్టుబడులు పెరిగిపోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు, వరదలు రావడంతో చాల ఇబ్బందుల్లో సాగు చేశాం. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరంన్నర సాగు చేస్తే చేతికందిందే సుమారు 40 వేల రూపాయలు. వాటిలో కౌలు శిస్తూ 18 వేల రూపాయలు పోనూ నా పంట పెట్టుబడి తీస్తే ఏమీ మిగల లేదు. ప్రస్తుత తుపానుతో వచ్చి పడ్డ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. 75 కేజీల బస్తాకు రూ.1,380 ఇచ్చారు.
–కొల్లు శాంతమ్మ, కౌలు రైతు, పాత పెద్దాపురం
75 కేజీల బస్తా రూ.1,400కే
ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. గత సీజన్‌లో ఇదే సమయంలో 40 బస్తాల దిగుబడి వచ్చింది. రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు. 75 కేజీల బస్తా పచ్చివి రూ.1,400కు, ఆరబెడితే రూ.1,620లకు మించి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మద్దతు ధర మాత్రం రూ.1,740 ఉంది. వాతావరణ పరిస్థితులతో ఆందోళన చెంది కళ్లాల్లోనే రూ.1,400కే అమ్ముకుంటున్నాం.
– అల్లాడి రాజు, రైతు,
వడ్లమూరు, పెద్దాపురం
Comments
Please login to add a commentAdd a comment