పుస్తకం తెరవకుండా పరీక్షలా! | - | Sakshi
Sakshi News home page

పుస్తకం తెరవకుండా పరీక్షలా!

Published Tue, Jan 21 2025 2:17 AM | Last Updated on Tue, Jan 21 2025 2:17 AM

పుస్త

పుస్తకం తెరవకుండా పరీక్షలా!

పాఠ్య పుస్తకాలు అందలేదు

ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఇంటర్‌లో అడ్మిషన్‌ పొందాను. సీఈసీ గ్రూపులో చేరాను. ఇప్పటి వరకూ పాఠ్య పుస్తకాలు అందలేదు. పాఠ్య పుస్తకాలు లేకుండా ఏ విధంగా ప్రిపేర్‌ అవ్వాలో అర్ధం కావడం లేదు. అసలు పాఠ్యాంశాలు తెలియకుంటే ఎలా..

– రాయి శ్రీకాంత్‌, ఇంటర్‌ అభ్యర్థి, రాయవరం

సమయం ఇస్తే మంచిది

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌లో ఎంపీసీ అడ్మిషన్‌ తీసుకున్నాను. పాఠ్య పుస్తకాలు మాకు ఇవ్వలేదు. సమయానికి పాఠ్య పుస్తకాలు ఇస్తే ప్రిపేర్‌ అవ్వడానికి వీలుంటుంది. పాఠ్య పుస్తకాలు లేకుండా ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్ధం కావడం లేదు. దీనివల్ల పరీక్షల్లో ఇబ్బంది పడతాం.

– చెల్లుబోయిన రామసంతోష్‌,

ఇంటర్‌ ఎంపీసీ అభ్యర్థి, రావులపాలెం

నేటి వరకూ ఓపెన్‌ విద్యార్థులకు

అందని స్టడీ మెటీరియల్‌

రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా

పరీక్షల నిర్వహణకు ప్రయత్నం

రాయవరం: పుస్తకాలు ఇంకా ఇవ్వలేదు.. పాఠ్యాంశాలు పూర్తి కాలేదు.. ఇప్పుడేమో పరీక్షలంటూ ప్రయత్నాలు చేసేస్తున్నారు. దీంతో సార్వత్మిక విద్యాపీఠం ద్వారా పది, ఇంటర్‌ కట్టిన విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ఏటా మార్చిలో రెగ్యులర్‌ విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు జరుపుతుంటాయి. ఈ మేరకు ఆ నెల 17 నుంచి నిర్వహించేందుకు బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ ఇచ్చింది. ఇంటర్‌ రెగ్యులర్‌ విద్యార్థులకు మార్చి 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటన చేసింది. ఇప్పుడు రెగ్యులర్‌ పది, ఇంటర్‌ పరీక్షలతో పాటు, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ కసరత్తు చేస్తుంది. గతానికి భిన్నంగా ఇలా ప్రయత్నించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధ్యాసాధ్యాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది నోటిఫికేషన్‌

ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పది, ఇంటర్‌ తరగతుల్లో చేరేందుకు గతేడాది జూలై 31న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. అపరాధ రుసుం లేకుండా నవంబర్‌ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అపరాధ రుసుంతో దరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం గతేడాది డిసెంబర్‌ 23 నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారి నుంచి పరీక్ష ఫీజును స్వీకరించారు. ఈ విధంగా కాకినాడ జిల్లా నుంచి పదో తరగతికి 2,142 మంది, ఇంటర్‌కు 6,183, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి పదికి 1,103, ఇంటర్‌కు 4,222 మంది, తూర్పుగోదావరి జిల్లా నుంచి పదికి 2,348, ఇంటర్‌కు 4,426 మంది అడ్మిషన్లు పొందారు.

అందని స్టడీ మెటీరియల్‌

ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పది, ఇంటర్‌ చదివే విద్యార్థులకు ఏపీ సార్వత్రిక విద్యా పీఠం స్టడీ మెటీరియల్‌ అందజేస్తుంది. పదో తరగతికి తెలుగు/హిందీ, ఇంగ్లిషు, గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఆప్షన్‌ కోరుకునే వారికి ఇతర సబ్జెక్టులు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ,, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంబైపీసీ గ్రూపులకు అవకాశం ఉంది. పది, ఇంటర్‌లో ఆయా కోర్సులు ఎంపిక చేసుకునే అభ్యర్థులకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం పాఠ్య పుస్తకాలు అందజేయాలి. అయితే పదో తరగతి కోర్సులో అడ్మిషన్‌ పొందిన వారికి నేటి వరకూ పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలను సరఫరా చేయలేదు. ఇంటర్‌ అభ్యర్థులకు వారు ఎంచుకున్న గ్రూపుల వారీగా పాఠ్య పుస్తకాలు అందజేయాల్సి ఉండగా, నేటి వరకూ పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. అడ్మిషన్‌ పొందిన వారికి పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో సరఫరా చేయకుండానే మార్చి నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్‌కు, మార్చి 17 నుంచి పదో తరగతి రెగ్యులర్‌ విద్యార్థులతో వార్షిక పరీక్షలను వీరికి కూడా నిర్వహించాలని ఏపీ సార్వత్రిక విద్యా పీఠం అధికారులు భావిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకుండా తాము ఏ విధంగా సబ్జెక్టు ప్రిపేర్‌ అవతామంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకేసారి నిర్వహిస్తే ఇబ్బందే..

ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా అడ్మిషన్‌ పొందిన వారికి రెగ్యులర్‌ విద్యార్థులతో కాకుండా ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేవారు. రెండేళ్ల ముందు వరకూ రెగ్యులర్‌ విద్యార్థులతో కాకుండా ప్రత్యేకంగా నిర్వహిస్తుండగా, రెండేళ్ల నుంచి రెగ్యులర్‌ విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం నుంచి ఓపెన్‌ స్కూల్‌ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా రెగ్యులర్‌ విద్యార్థులను, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులను కలిపి ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ తరహా విధానంలో రెగ్యులర్‌ విద్యార్థులకు, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు కలిపి పరీక్షలు నిర్వహించడం వల్ల గందరగోళ పరిస్థితి తలెత్తే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలను సరఫరా చేసి, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు వేరుగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఓపెన్‌ స్కూల్‌ తరగతుల్లో విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
పుస్తకం తెరవకుండా పరీక్షలా!1
1/3

పుస్తకం తెరవకుండా పరీక్షలా!

పుస్తకం తెరవకుండా పరీక్షలా!2
2/3

పుస్తకం తెరవకుండా పరీక్షలా!

పుస్తకం తెరవకుండా పరీక్షలా!3
3/3

పుస్తకం తెరవకుండా పరీక్షలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement