చికిత్స పొందుతూ యువకుడి మృతి
కరప: తాగిన మత్తులో కొబ్బరిచెట్టు ఎక్కి, జారిపడిన ఘటనలో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఒక యువకుడు మృతిచెందాడు. కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన మాకిరెడ్డి దుర్గాప్రసాద్(23) కాకినాడ పోర్టులో కూలీగా పనిచేస్తుంటాడు. దుర్గాప్రసాద్ తన స్నేహితులతో కలసి ఈ నెల 10వ తేదీన గ్రామంలోని ఒక లేఅవుట్‌లో మద్యం సేవించాడు. తర్వాత అతని స్నేహితులు వెళ్లిపోగా ఒక స్నేహితుడు అశోక్‌కుమార్‌తో కలసి రాత్రి 11.30 గంటల సమయంలో చలిమంట వేసుకున్నారు. దుర్గాప్రసాద్ తాగిన మత్తులో అక్కడే ఉన్న కొబ్బరిచెట్టు ఎక్కి రెండు కొబ్బరిబొండాలు తీసి, కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తూ కొబ్బరిచెట్టు పైనుంచి జారి కిందకు పడిపోయి, స్పృహ కోల్పోయాడు. వెంటనే అశోక్‌కుమార్ ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు తెలిపి, చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి చికిత్సపొందుతూ అతను మృతిచెందాడు. మృతుడు తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్‌ఐ టి.సునీత కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment